Hyderabad | గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై మరో ఘోర రోడ్డు ప్రమాదం

-

Hyderabad | హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌ పైనుంచి కిందపడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రాయదుర్గం నుంచి మాదాపూర్‌ వెళ్తున్న యువకులు మితిమీరిన వేగంతో డివైడర్‌ను ఢీకొని మరో ఫ్లైఓవర్‌పై పడ్డారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మృతుడు గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న మధు (25)గా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...