MRPS నాయకుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ప్రధాని మోడీని కలిసి ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలని కోరిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా.. మందకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ సమావేశాలల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు( SC Classification Bill) ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సామాన్య కార్యకర్త నుండి ప్రధాని మోడీ వరకు వర్గీకరణకు అనుకూలమని చెబుతూనే, మాదిగలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
వర్గీకరణ పట్ల హామీ ఇస్తూనే పార్లమెంట్‌లో ఎందుకు ప్రవేశ పెట్టడం లేదని ప్రశ్నించారు. ఇటీలవ ప్రధాని మోడీని కలిశానని, SC వర్గీకరణ పట్ల పూర్తి అవగాహణ ఉందని, వర్గీకరణ చేస్తామని మూడుసార్లు ప్రధాని హామీ ఇచ్చినట్లు ఆయన(Manda Krishna) చెప్పారు. ఇలాగే కాలయాపన చేస్తే బీజేపీ మీద నమ్మకం పెట్టుకున్న మాదిగలు విశ్వసించబోరని అసహనం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో మాదిగల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందన్నారు. వర్గీకరణ చేయకుండా కాలయాపన చేస్తే మాదిగల ఓట్లు అడిగే నైతిక హక్కును బీజేపీ కోల్పోతుందన్నారు.