భద్రాచలం మెడికల్ మాఫియాకు మావోయిస్టుల తీవ్ర హెచ్చరిక

-

Maoist Threatening letter to Bhadrachalam Medical Mafia: భద్రాచలంలో మావోయిస్టుల హెచ్చరిక లేఖలు కలకలం రేపుతున్నాయి. భద్రాచలం లో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మెడికల్ మాఫియా అక్రమంగా సంపాదిస్తుందని మావోయిస్టులు పేర్కొన్నారు. సంత క్లినిక్స్ పెట్టుకొని సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆగ్రహించారు. పద్ధతి మార్చుకోకపోతే మూల్యం చెల్లించాల్సిందేనంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజా కోర్టులో శిక్షిస్తామంటూ తేల్చి చెప్పారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే-ఏఎస్ఆర్) ఓ లేఖను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ లేక వైద్య వర్గాల్లో కల్లోలం సృష్టిస్తోంది. వారు లేఖలో ఏం రాశారో కింద ఉంది చదవవచ్చు.

- Advertisement -
  • మెడికల్ మాఫీయా అడ్డాగా మారిన భద్రాచలం ఆసుపత్రులు 
  • రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ డబ్బులు పోగేసుకుంటున్న వైద్యులు
  • పద్ధతి మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు.

మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం ఇప్పుడు మెడికల్ మాఫీయాకు(Bhadrachalam Medical Mafia) కాసులు కురిపిస్తుంది. పూర్తి ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని సంపాదనే ధ్యేయంగా ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని బూచిగా చూపి వారిని బయబ్రాంతులకు గురిచేసి రోగుల రక్తం పిండుకుంటున్నారు. ఛత్తీస్ఘడ్, ఒడిస్సా, ఆంధ్ర ప్రాంత గిరిజనులు, గిరిజనేతరులతో పాటు స్థానిక తెలంగాణ ప్రాంత ప్రజలను వైద్యంపేరుతో రోజులు తరబడి ఆసుపత్రుల్లో ఉంచి అవసరం లేకున్నా రకరకాల పరీక్షలు చేస్తూ ల్యాబులు, ఆసుపత్రులు, వైద్యులు ప్రజలను డబ్బుల కోసం హింసిస్తున్నారు. ప్రజల ప్రాణాలు ఇప్పడు ఆసుపత్రులకు డబ్బులు కురిపించే అవకాశాలుగా మారాయి. ప్రజల నమ్మకానికి తూట్లు పొడుస్తూ కొందరు వైద్యులు రాక్షసుల్లా తయారయ్యారు. పెద్దోళ్లు.. పేదోళ్ళనే తేడాలు లేకుండా రోగుల రక్తం జలగల్లా పీల్చుతున్నారు.

ఆరోగ్య సమస్యలను అలుసుగా చేసుకుని…మనిషిలో రకరకాల పరీక్షల పేర్లతో భయాన్ని సృష్టిస్తూ ఆసుపత్రి గల్లలను కొల్లలుగా నింపుకుంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రి మొదలుకొని ప్రభుత్వ ఆసుపత్రి వరకు కాసుల కక్కుర్తి మరిగిన వైద్యులు జనాలను పీడించుకుతింటున్నారు. ముఖ్యంగా భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో పని చేసే వైద్యులు సైతం తమ సొంత క్లీనిక్లకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తు ప్రభుత్వ పనివేళలను విస్మరిస్తున్నారు. సమయానికి రోగికి అందించాల్సిన వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల్లో లేనిపోని అబద్దపు అపోహలతో భయాన్ని పెంచి తమ సొంత క్లీనిక్స్ ని తరలించుకుంటున్నారు. ప్రధానంగా మెడికల్ మాఫియాగా మారిన వైద్య వృత్తి ఫార్మ కంపెనీలతో జతకడుతూ తక్కువ ధరకు అమ్మాల్సిన మందులను బ్రాండుల పేర్లతో ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. ఇక్కడి వైద్యులు మనుషులకి కరెన్సీ నోట్లు ముద్ర వేసే యంత్రాల్లా భావిస్తూ నోటికి వచ్చిన టెస్టుల పేర్లు చెప్తూ.. చేతికి వచ్చిన ఖరీదైన మందుల పేర్లు రాస్తూ పేద ప్రజలను రాబందుల్లా పీక్కుతింటున్నారు.

భద్రాచలం మెడికల్ మాఫీయాకు హెచ్చరిక..!

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు వారి సమయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేటాయించకుండా ఇలానే ప్రవర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గిరిజన ప్రాంతమైన భద్రాచలం ప్రాంతంలో సంపాదనే ధ్యేయంగా ప్రైవేటు ఆసుపత్రులను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో నివసించే గిరిజనుల అమాయకత్వాన్ని అసరా చేసుకొని కోట్లకు పడగెత్తిన వైద్యులు, ల్యాబ్, మెడికల్ షాప్ ల యజమానులు తమ పద్ధతిని మర్చుకోక పోతే ప్రజకొర్టు లో శిక్ష తప్పదు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...