Marri Shashidhar Reddy: నేడు బీజేపీలో మర్రి శశిధర్ రెడ్డి చేరిక.. బీజేపీలో ఇమడగలరా?

-

Marri Shashidhar Reddy Will Join Bjp: మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి ఈరోజు బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఆయన బుధవారం ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఢిల్లీకి చేరుకున్నారు. కాగా.. మర్రి శశిధర్ రెడ్డితో పాటు నిర్మల్ జిల్లా మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు పవార్ రామారావు పటేల్ కూడా బీజేపీలో చేరనున్నాట్టు సమాచారం. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావుతో గురువారం ఢిల్లీకి రామారావు పటేల్ బయలుదేరారు. అయితే.. రాజకీయ పార్టీల్లో బీజేపీ పార్టీ ఓ ప్రత్యేక శైలితో, ప్రత్యేకమైన భావజాలంతో రాజకీయం చేస్తుంది. అందువల్లే బీజేపీలో చేరిన చాలమంది నాయకులు బీజేపీలో ఇమడలేకా.. బయటకు వచ్చేస్తున్న నాయకులను మనం చూస్తున్నాం.. కొంత మందైతే.. కనుమరుగైన విషయం అందరికి తెలిసిందే. మరి ఇప్పుడు మర్రి శశిధర్రెడ్డి (Marri Shashidhar Reddy) బీజేపీ భావజాలంతో ముందుకు వెళ్తారా..లేదా ఇమడలేక బయటకు వచ్చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...

Mohan Babu | మోహన్ బాబుకి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం

ప్రముఖ నటుడు మోహన్‌బాబు(Mohan Babu)కి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం లభించింది....