సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద మరో అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్‌కు సమీపంలో ఉన్న పాలికాబజార్(Palika Bazar)లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నాయి. అధికారులు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
భారీ అగ్ని ప్రమాదంతో పాలికాబజార్(Palika Bazar) చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే ఈరోజు లష్కర్ బోనాలు(Lashkar Bonalu) జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా జనసందోహంతో హడావిడిగా ఉంది. పైగా ఈరోజు ఆదివారం కావడంతో షాపింగ్ చేసేవారు కూడా ఎక్కువగా వస్తుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వైపు ఎవరినీ రానీయకుండా చూస్తున్నారు. మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. షాపులు ఓపెన్ చేయని సమయంలో కావడంతో పరిసర ప్రాంతాల్లో పెద్దగా జనం లేరు. దీంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఇదిలా ఉండగా సికింద్రాబాద్ పరిధిలో వరుస ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Read Also: ఫలక్ నుమా రైలు ప్రమాద ఘటనతో రైల్వేకి ఎంత నష్టం?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat