గండిపేట(Gandipet) మూవీ టవర్స్ దగ్గర ఒక బీభత్సం సృష్టించింది. అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న శ్రీకర్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి మరణించాడు. అతనితో కలిసి అదే కారులో ప్రయాణిస్తున్న హేమసాయి, కార్తికేయ, హర్ష, వివేక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఎంజీఐటీ కాలేజీ ఇంజినీరింగ్ విద్యార్థులు ఆరుగులు కలిసి నార్సింగి నుంచి నియోపొలిస్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
Gandipet | గండిపేటలో రోడ్డు ప్రమాదం.. ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
-