మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల(Satya Nadendla)తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. సోమవారం సాయంత్రం హైదారాబాద్ లో సత్య నాదెళ్ల నివాసంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు శ్రీధర్ బాబు(Sridhar Babu), ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ సిఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన, స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ అంశాలపై చర్చించేందుకు సీఎం బృందం సత్య నాదెళ్లను కలిశారు.
సమావేశంలో హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిందిగా సత్య నాదెళ్ల(Satya Nadendla)ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ లో 4,000 ఉద్యోగాలు ఇవ్వడంపై ఇటీవల మైక్రోసాఫ్ట్ తో జరిగిన ఒప్పందం గురించి కూడా ఇరువురు ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ఫోర్త్ సిటీ అభివృద్ధిపైనా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో చర్చించారు.