BRSతో పొత్తుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. పొత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తమను బీజేపీ బీ టీం అని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని అందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు. బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని ఓవైసీ అన్నారు. తెలంగాణలో 50 స్థానాల్లో పోటీపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి వెళ్తామని, పరేడ్ గ్రౌండ్స్ సభతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.