Telangana Elections |తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ప్రకటించారు. అయితే ఇప్పటివరకు 7 స్థానాల్లో పోటీ చేస్తూ వస్తున్న ఎంఐఎం ఈసారి మాత్రం అదనంగా మరో రెండు స్థానాల్లో నుంచి బరిలో దిగేందుకు నిర్ణయించామని తెలిపారు. ప్రస్తుతం ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తోన్న చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకత్‌పురా, నాంపల్లి, బహదూర్‌పూరా, కార్వాన్, మలక్‌పేట్‌తో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల నుంచి కూడా బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నారు. తొలి జాబితాలో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నామని ఆయన వెల్లడించారు.
అభ్యర్థుల జాబితా ఇదే..
చార్మినార్- జుల్ఫికర్ అహ్మద్
చాంద్రాయాణగుట్ట – అక్బరుద్దీన్ ఓవైసీ
మలక్ పేట – అహ్మద్ బలాలా
నాంపల్లి- మజీద్ హుస్సేన్
కార్వాన్- కౌసిర్ మోహిద్దీన్
యాకుత్ పురా- జఫార్ హుస్సేన్ మిరాజ్
Telangana Elections | ఈ 6 స్థానాలతో పాటు మిగిలిన మూడు స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. కొత్తగా పోటీ చేస్తున్న జూబ్లీహిల్స్. రాజేంద్రనగర్ స్థానాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నుంచి ఈసారి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ బరిలో దిగుతుండగా ఇప్పుడు ఎంఐఎం కూడా పోటీ చేస్తామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.