తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కింగ్ మేరక్ పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామేనన్నారు. అయితే ఇటీవలే బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఫిర్యాదుతో కొంతమంది మజ్లీస్ నేతలు అరెస్టైన విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో జైళ్లలో ఉన్న ఆ నేతలతో అసదుద్దీన్ ములాఖత్ అయ్యారు. అలాగే రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎంఐఎం(MIM) పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. తెలంగాణలో తామే బ్యాటింగ్ చేసి స్కోర్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో ఐదు నెలల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ వ్యూహాలు రచిస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో చేరికలు మొదలయ్యాయి. ఎన్నికలు సమీపించే నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమంటే మేము అని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒకదానికొకటి పోటీపడుతున్నాయి. ఈ నేఫథ్యంలో ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also:
1. లంచ్ బాక్స్ స్పెషల్: హైదరాబాద్ దమ్ కిచిడీ
2. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చిట్కాలు ట్రై చేయండి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat