బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా ఆసిఫ్ నగర్‌లో చెరువుల పండుగ నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న గంగుల.. నాటు పడవలో ప్రయాణించారు. అయితే ఒక్కసారిగా పడవ నీటిలో మునగడంతో ప్రమాదం జరిగింది.
- Advertisement -
దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ అనూహ్య ఘటనతో అక్కడున్న వారంతా షాకయ్యారు. కాసేపటి తర్వాత తేరుకున్న మంత్రి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. అయితే సందడిగా సాగిన కార్యక్రమంలో ఇలా జరిగిన అపశృతితో గందరగోళం నెలకొంది. దీంతో గంగుల వారికి ధైర్యం చెప్పి కార్యక్రమాన్ని కొనసాగించారు.