Minister Harish rao comments on bjp: కేంద్ర ప్రభుత్వం పై మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు.టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రన్ని..వరి ధాన్యం కొనమంటే కొనదు.. కానీ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాత్రం ఎన్ని కోట్లు ఖర్చు చేసైనా కొంటుందని ఎద్దేవా చేశారు. ఒక్కో ఎమ్మెల్యేను కొనేందుకు రూ.100 కోట్లు పెట్టడానికైనా వెనుకాడలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్ర, రాష్ట్ర బీజేపీ కుట్ర చేస్తుందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.
- Advertisement -