Minister Harish Rao :మునుగోడు ఓటర్లు అమాయకులని బీజేపీ అనుకుంటోందని ఆర్థిక మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకులు ప్రజల్ని మోసం చేసేందుకు పగటి కలలు కంటున్నారని, వారి మాటలు నమ్మడానికి మునుగోడు ఓటర్లు అమాయకులు కాదన్నారు. మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీలను మోదీ తప్పారని, ఏడాది దాటినా మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించలేదని మండిపడ్డారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో గెలిస్తే రూ. 3 వేలు పెన్షన్ అన్నారని.. గుజరాత్‌లోనే రూ.750 పెన్షన్ ఇస్తున్నారని అపహాస్యం చేశారు. కేసీఆర్ రెండో సారి గెలిస్తే రెండు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. అని కొనియాడారు. దమ్ముంటే బీజేపీ పాలిత రాష్టాల్లో 3వేలు పింఛన్ ఇచ్చి చూపండి అని సవాల్ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా అన్ని అబద్ధాలు చెప్పారని.. ఇప్పుడు మునుగోడులో కూడా అసత్య, అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు