రాష్ట్ర వ్యాప్తంగా ఇటీలవ కురిసిన అకాల వర్షాలకు భారీగా పంటనష్టం జరిగిన విషయం తెలిసిందే. వరి, మొక్క జొన్న, పత్తి వంటి రైతులు నిండా మునిగిపోయి సర్కారు ఆదుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రైతులకు మంత్రి హరీశ్ రావు(Harish Rao) శుభవార్త చెప్పారు. ఇటీవల పంటనష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన ఏ ఒక్క రైతునూ వదిలి పెట్టకుండా ప్రతి ఒక్కరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హరీశ్‌రావు(Harish Rao) భరోసా ఇచ్చారు. ‘మనకు సీఎం కేసీఆర్ సార్ ఉన్నారు. మీరు ఎవరూ అధైర్యపడవద్దు’ అంటూ రైతులను ఓదార్చారు. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం ఉన్నదని, రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్(CM KCR) ఉన్నారని, రైతులు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు. నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మాదిరిగానే కేంద్రం కూడా ఎకరాకు మరో రూ.10 వేల చొప్పున ఇచ్చి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
Read Also: ‘దక్షిణాది నుంచి తొలి సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించడం ఖాయం’
Follow us on: Google News, Koo, Twitter