జర్నలిస్టులకు ప్రభుత్వ ఇళ్ళు… మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్

-

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. జర్నలిస్టుల ఇళ్ల కోసం కేటాయించిన భూమికి మంత్రి హరీష్ రావు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నారాయణఖేడ్ లో 110 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ళు కూడా కట్టిస్తున్నాం. కరోనా లాంటి కష్ట కాలంలో జర్నలిస్టులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని గుర్తు చేశారు. జర్నలిస్టులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుందని మంత్రి తెలిపారు.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | గల్లంతైన వారి ఆచూకీ ఇంకా తెలీదు: సీఎం రేవంత్

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్నవారి ఆచూకీ ఇంకా...

Revanth Reddy | హరీష్‌కు రేవంత్ కౌంటర్

SLBC ప్రమాదం అంశంపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao).....