Minister Harish Rao:కంటి సమస్యలతో బాధపడేవారికి మంత్రి హరీష్ రావు కీలక హమీలు

-

Minister Harish Rao Review on kanti velugu second fase: గతంలో కోటి 50 లక్షల మందికి కంటి స్కీనింగ్ పరీక్షలు చేశామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. 2వ విడత కంటి వెలుగు ఏర్పాట్లపై మంత్రి హరీష్ రావు ఉన్నతస్థాయి సమీక్షలు జరిపారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల డిఎంహెచ్ లు, డిప్యూటీ డిఎంహెచ్ లు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఇది అత్యంత పెద్ద స్కీనింగ్ అని అన్నారు. రూ.200 కోట్ల నిధుల విడుదలకు జివొ జారీ చేశామని, వంద రోజుల్లో కార్యక్రమం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మొదటి దశలో 800 టీమ్స్ ఏర్పాటు చేశామని, 2వ దశలో 1500 టీమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 1500 టీమ్స్‌కు 1500 మంది డాక్టర్లు, 1500 ఎఆర్‌టి యంత్రాలను ఇస్తున్నామని, జనవరి 5న కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు.

- Advertisement -

కంటి సమస్యలతో బాధపడేవారి కోసం సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు అన్నారు. మంగళవారం కంటి వెలుగు ఏర్పాట్లపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షలు జరిపారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల డీఎంహెచ్‌‌లు, డీప్యూటీ డీఎంహెచ్‌‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. గతంలో కంటి వెలుగు కార్యక్రమం ద్వరా.. 1.54 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహించి, 50లక్షల మందికి కళ్ళ అద్దాలు ఇవ్వడం జరిగిందని.. వరల్డ్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రాంగా ఆ కార్యక్రమం నిలిచిందని గుర్తుచేశారు. అయితే.. రాష్ట్రంలో ప్రజల కంటి సమస్యలు తొలగించేలా ఇప్పుడు మరో మారు కంటి వెలుగు-2 కార్యక్రమం మొదలు పెట్టామని.. ఈసారి కోటిన్నర మందికి పరీక్షలు చేసి 55 లక్షల మందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు. దీనికోసం మరోసారి అందరం కలిసి ఉత్సాహంగా పని చేద్దామని పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్ ప్రజల కోణంలో ఆలోచించి ఈ కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. దీని కోసం ప్రభుత్వ పరంగా అన్ని చేస్తామని.. మీరు పూర్తి బాధ్యతతో పని చేయాలని కోరారు. ‘‘ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం 200 కోట్లు ఇస్తుంది. ఈ కార్యక్రమన్ని 100 రోజుల్లో పూర్తి చేసేందుకు బృందాల సంఖ్య పెంచాము. మొదటి సారి 827 బృందాలు పని చేస్తే, ఇప్పుడు ఆ సంఖ్య 1500లకు పెంచాము. 969 పీహెచ్‌‌సీ డాక్టర్ల ఫైనల్ లిస్ట్ వచ్చే డిశంబర్‌‌లో విడుదల చేస్తాం. 1500 బృందాల ఏర్పాటుకు డాక్టర్లు సరిపోతారు. 1500 అప్టో మెట్రిషన్స్, 1500 ఎంట్రీ ఆపరేటర్లను త్వరగా నియమించాలి. బృందాలకు సరిపడా 1500 వాహనాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. రెగ్యులర్ సర్వీసు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. డీఎంహెచ్‌‌వోలు బాగా పని చేయాలి. ప్రజా ప్రతినిదులు భాగస్వామ్యం చేయాలి. జిల్లా కలెక్టరు సహకారం తీసుకోవాలి. జనవరి 5న జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ఉంది. బాగా ప్లాన్ చేయాలి. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ రావొద్దు.

అదనపు బృందాలు ఉంటాయి. సమస్య వస్తే రీప్లేస్ చేస్తాం. బృందాలకు అవసరం అయ్యే ఏర్పాట్లు చేస్తాం. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. పూర్తి స్థాయిలో ప్లాన్ వేసుకోవాలి. బృందానికి రోజువారీ ప్లానింగ్ ఇవ్వాలి. పరీక్షలు చేసుకోవడం మిస్ అయిన వారీ కోసం కూడా మళ్ళీ ఏర్పాటు చేయాలి. జనవరి1 వరకు ఆటో రీఫ్రాక్తో మిషన్లు మీ వద్దకు వస్తాయి. కార్యక్రమం ప్రారంభించడానికి ముందుగానే రీడింగ్ గ్లాసెస్ కూడా మీ వద్దకు వస్తాయి. పరీక్షలు చేసిన నెల రోజుల్లో ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేస్తాం. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నీ కూడా శిక్షణ ఇచ్చి వినియోగిస్తాము. స్టేట్ లెవెల్ 10 క్వాలిటీ కంట్రోల్ టీం, జిల్లాల్లోకొక క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఏర్పాటు చేస్తాము. వారు ప్రభావవంతంగా కార్యక్రమం జరుగుతుందా లేదా అని పరిశీలన చేస్తారు. ఎల్వీ ప్రసాద్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సహకారంతో వీరికి రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇస్తాము. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అద్దాల డిమాండ్ తీర్చేలా ఆటోమేటిక్ ఆర్డర్ ఫెసిలిటీ ఉంటుంది.

ఈయాప్ పనితీరుపై శిక్షణ ఇస్తాము. ప్రభుత్వం తరుపున అన్ని విధాలా పూర్తి స్థాయి సహకారం ఉంటుంది. కానీ ఎఫెక్టివ్ గా జరిగేందుకు మీరు కృషి చేయాలి. జనవరి10కి 10 నుండి 15 లక్షల కళ్ళ జోల్లు మీ వద్దకు వస్తాయి. అద్దాల బాక్స్ మీద బార్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేయగానే లబ్దిదారుల వివరాలు ఉంటాయి. కంటి సమస్యలతో రాష్ట్రంలో ఏ ఒక్కరూ బాధ పడకూడదు అనే లక్ష్యంతో కేసిఆర్ ఉన్నారు. దాన్ని అమలు చేయడంలో మనందరిది ముఖ్య పాత్ర పోషించాలి. లక్ష్యం నెరవేరేలా అందరం కలిసి కృషి చేద్దాం. కంటి వెలుగులో బాగా పని చేసే వారికి ప్రశంసలు ఉంటాయి. శాఖ పరమైన గుర్తింపు ఉంటుంది. విధుల్లో నిర్లక్యంగా ఉంటే చర్యలు కూడా ఉంటాయి. ఈ గొప్ప కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌‌లో నమోదు అయ్యేలా అందరం కృషి చేద్దాం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్‌‌పి ఛైర్మెన్, ఎంపిటిసి, సర్పంచ్, ఇలా అందరి ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం పెంచాలి.’’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు (Minister Harish Rao అధికారులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...