Minister Harishrao: అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం

-

Minister Harishrao: అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది..అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్రిగూడెం మండలం రాజుపేట తండాలో గ్రామస్థులతో బేటీ అయ్యారు. అనంతరం గ్రామస్థులతో కలిసి టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక కొబ్బరికాయ కొడితే 100 పనులు జరుగుతాయని రాజగోపాల్ రెడ్డి అన్నారని గుర్తుచేశారు. మరి ఈ నాలుగు సంవత్సరాలలో ఒక కొబ్బరికాయ కూడా కొట్టే సమయం దొరకలేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ తండాలను గ్రామా పంచాయితీలుగా చేయడం వల్ల మొత్తం 3146 మంది సర్పంచులు అయ్యారని అన్నారు. ఈ ప్రాంతంలో మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఏం లాభం లేదని పేర్కొన్నారు. బీజేపీ గెలిస్తే 3000 పెన్షన్ ఇస్తారా? అని ప్రశ్నించారు. మోడీ సొంత రాష్ట్రంలోనే బీజేపీలో 700 పెన్షన్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. మర్రిగూడెంను అభివృద్ధి చేసే బాధ్యత నాది అని Minister Harishrao హామీ ఇచ్చారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...