Minister Jagadish Reddy made sensational comments on Komatireddy Rajagopal Reddy: జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీపై మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశానికి కేసీఆర్ అవసరం ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశంలోని చేసిచూపిస్తారని, ఆ దమ్ము కేసీఆర్‌కు ఉందని అన్నారు. దేశాభివృద్ధి కోసం కేసీఆర్‌ను ఢిల్లీకి పంపుదామని పిలుపునిచ్చారు. దేశం మొత్తం కేసీఆర్ రాక కోసం ఎదురుచూస్తోందని అన్నారు. మునుగోడులోనూ టీఆర్ఎస్(TRS) జెండా ఎగరబోతోందని జోస్యం చెప్పారు.
దేశంలో కేసీఆర్‌ను తిరగనీయకుండా బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునేందుకు మోడీ ఏజెంట్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) ఎన్నికల్లో పోటీ చేస్తు్నారని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. అనంతరం గట్టుప్పల్ మండల ఏర్పాటుపై మాట్లాడుతూ.. అభిప్రాయాలు తీసుకున్నాకే మండలాన్ని ఏర్పాటు చేశామన్నారు. గట్టుప్పల్ ప్రజల 37 ఏళ్ల నిరీక్షణ ఫలితం ఇదని వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా అర్థం లేనిదని, ఆయన బహిరంగ మార్కెట్లో రూ. 22 వేల కోట్లకు అమ్ముడుపోయారని విమర్శించారు. కేంద్రం నుంచి మునుగోడుకు పైసా రాలేదని మండిపడ్డారు. కేవలం ద్రోహం, స్వార్థం తప్ప అభివృద్ధిపై రాజగోపాల్‌కు సోయి లేదని ఎద్దేవా చేశారు.