Minister Jagadish Reddy | రేవంత్ రెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్

-

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్ చాలు అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన కామెంట్స్ తీవ్ర వివాదానికి తెరతీశాయి. అధికార బీఆర్ఎస్ నేతలు దీనిని స్ట్రాంగ్‌గా తిప్పికొడుతున్నారు. అంతేగాక, ఎన్నికల వేళ ప్రచార అస్త్రంగా మలుచుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ వేగం తగ్గి, కాంగ్రెస్‌ స్పీడు పెంచిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అధికార పార్టీకి ప్లస్‌గా మారింది. తాజాగా.. ఈ వివాదంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy) మరోసారి స్పందించారు.

- Advertisement -

అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ ఉన్నప్పుడు.. రైతులకు ఎందుకు ఉండొద్దని జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో 24 గంటలు అవసరమైనప్పుడు.. రైతులకు ఎందుకు ఉండకూడదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో కరెంట్ కోసం రాత్రి వేళ పొలాలకు వెళ్లి ఎంతోమంది రైతులు తమ ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేశారు. ఎక్కడైనా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పిందా అని జగదీశ్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి రైతుల పొట్ట కొట్టాలని చూస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు మళ్లీ కష్టాలు తప్పవని అన్నారు.

Read Also: ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. ఉచిత కరెంట్ ఇస్తుంది’

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...