Minister Komatireddy | మూర్తి హత్య వెనక కేసీఆర్ హస్తం: కోమటిరెడ్డి

-

సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య వెనక మాజీ సీఎం కేసీఆర్ హస్తమందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) ఆరోపించారు. వారి అవినీతిని బట్టబయలు చేస్తున్నారే మూర్తిని హతమార్చారాని, ఈ హత్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై సీబీసీఐడీతో విచారణ జరిపిస్తామని చెప్పారు. కేసీఆర్ నుంచి ఎవరికైనా ప్రాణభయం ఉంటే.. వారు ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని, ప్రభుత్వం వారికి తగిన రక్షణ కల్పిస్తుందని తెలిపారు. ‘‘బీఆర్ఎస్ పడేండ్లలో హత్యా రాజకీయాన్ని పెంచి పోషించింది. బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించిన రాజలింగాన్ని హత్య చేశారు.

- Advertisement -

రాజలింగ మూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్న. కాళేశ్వరం ప్రాజెక్టు లో కేసీఆర్ తో పాటు ఐదుగురు పై సామాజిక కార్యకర్త రాజలింగం కోర్టులో కేసు వేశాడు. హత్య గండ్ర వెంకటరమణారెడ్డి చేయించాడు. కాళేశ్వరంలో కేసీఆర్‌కు దోషిగా శిక్ష పడుతుందని కేసీఆర్(KCR), కేటిఆర్(KTR) లు హత్య చేయించారని రాజలింగమూర్తి కూతురు, భార్య చెప్తుంది. అడ్వకేట్ వామన రావు, భార్యాభర్త హత్యకు ఎవరు కారణమో అందరికి తెలుసు. వరంగల్ లో ఎంపీడీఓ ను హత్య బీఆర్ఎస్ వాళ్ళు చేశారని అప్పటి సిపి రంగనాథ్ చెప్పారు’’ అని Minister Komatireddy గుర్తు చేశారు.

‘‘కొడంగల్‌లో సాక్షాత్తు జిల్లా కలెక్టర్‌పై కూడా సురేష్ అనే రౌడీ షీటర్ దాడి చేశారు. బీఆర్ఎస్ లక్ష్యం ఒక్కటే తెలంగాణలో అభివృద్ధి జరగకూడదనేది. కేసీఆర్ కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని అంటుండు. హత్య రాజకీయాలు చేయడమేనా మీ గ్రాఫ్ కేసీఆర్? కేసీఆర్ కిరాయి హత్యలు చేయించడమే తప్ప ఆయనకు ఇంకేమీ రాదు. 15నెలల నుండి పామ్ హౌస్ నుండి ఎప్పుడైనా బయటకి వచ్చిండా? రాజలింగమూర్తి హత్య ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నా. హత్యలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరమణ రెడ్డి(Gandra Venkata Ramana Reddy) పాత్ర ఉంది.

సీబీ సీఐడీ విచారణ చేసి 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేయాలి’’ అని కోరారు. ‘‘పాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి వెంటనే శిక్ష వేయాలి. హత్యను సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా తీసుకుంటాడు. లగచర్లలో లో కూడా కలెక్టర్ ను చంపాలని చూసిండ్రు. తెలంగాణలో హత్య రాజకీయాలకు తావు లేదు. అవినీతి మీద పోరాడే వారికి రక్షణ కల్పిస్తాం. హరీష్ రావు అవినీతి మీద పోరాడుతున్న చక్రధర్ కూడా రక్షణ కల్పిస్తాం. తెలంగాణ ను దోచుకొని తిని ఎదురు తిరిగిన వాళ్ళను చంపేస్తారా? పాపం తగిలి పోతారు’’ అని విమర్శలు చేశారు.

Read Also: కాంగ్రెస్ మొద్దు నిద్ర వీడాలి.. హరీష్ రావు ఆగ్రహం
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...