సెల్ఫీలకు రూ.500 అడిగిన కేటీఆర్.. పర్లేదంటూ యువత ఫోటోలు

-

తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కు యూత్ లో మాంఛి ఫాలోయింగ్ ఉంది. ఆయన ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. #askme హ్యాష్ ట్యాగ్ పేరుతో ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేస్తుంటారు. ఏదైనా సమస్యలు ప్రస్తావిస్తే వెంటనే పరిష్కారానికి చొరవ చూపిస్తుంటారు. దీంతో ఆయనకు యూత్ లో ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. ఆయన ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా అక్కడ యూత్ ఆయనతో ఫోటో కోసం ఎగబడుతుంటారు. తాజాగా రాజన్న సిరిసిల్ల(Rajanna Sircilla) జిల్లా ఎల్లారెడ్డి మండలంలో పర్యటించారు. పర్యటన ముగించుకుని కారులో వెళ్తుండగా ఆయనతో సెల్ఫీ కోసం యువత ఎగబడ్డారు. దీంతో వారిని కాదనకుండా కేటీఆర్(KTR) సెల్ఫీలిచ్చారు. అయితే అభిమానుల తాకిడి ఎక్కువకావడంతో కేటీఆర్ సరదాగా వారితో సెల్ఫీకి రూ.500 ఖర్చవుతుందంటూ వ్యాఖ్యానించారు. అయినా కానీ వారు మాత్రం కేటీఆర్ తో సెల్ఫీలు కోసం పోటీపడ్డారు. దీంతో కేటీఆర్ కు యువతలో ఎంత ఫాలోయింగ్ ఉందో చూడండంటూ బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

- Advertisement -
Read Also: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్టేడ్.. త్వరలో వకీల్ సాబ్2!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...