కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వానికి లేఖ రాశారు. పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా దోచుకుంటున్నదని మండిపడ్డారు. ఈ దోపిడీకి అంతర్జాతీయ ముడిచమురు ధరలను బూచిగా చూపించి కేంద్రం ఇంతకాలం చెప్పిన మాటలన్నీ కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయిందని ఎద్దేవా చేశారు.
2013లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లు ఉన్నప్పుడు, దేశంలో లీటర్ పెట్రోల్ రేటు కేవలం 76 రూపాయలు. కానీ, నేడు బ్యారెల్ ముడిచమురు రేటు దాదాపు సగం పడిపోయినా.. అంటే 66 డాలర్లకు తగ్గినా, ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్‌కు రూ.110 ఉండడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. అందుకే దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదని, మోడీ నిర్ణయించిన చమురు ధరలేనని మనం గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైందని కేటీఆర్(KTR) స్పష్టం చేశారు.
Read Also: పండగపూట ఇండోర్‌లో తీవ్ర విషాదం.. అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం
Follow us on: Google News, Koo, Twitter