మంత్రి కేటీఆర్(KTR) ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్మూరులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓపెన్‌టాప్ వాహనం నుంచి ఆయన ముందుకు జారిపడ్డారు. ఇదే సమయంలో వాహనంపై నుంచి మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పూర్తిగా కిందపడిపోయారు. అయితే కేటీఆర్ కింద పడకుండా గన్మెన్లు ఆయనను గట్టిగా పట్టుకోవడంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో అక్కడున్న కార్యకర్తలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
జీవన్ రెడ్డి(Jeevan Reddy) నామినేషన్ సందర్భంగా పాత ఆలూర్ రోడ్డు వద్ద చేపట్టిన ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓపెన్ టాప్ వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ ప్రయాణస్తుండగా వ్యాన్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వారంతా అదుపు తప్పి ముందుకు పడిపోయారు. ఈ సందర్భంగా వాహనంపై ఉన్న రెయిలింగ్ ఊడిపోవడంతో ముందుకు పడిపోయారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాకపోవడంతో జీవన్‌రెడ్డితో పాటు కేటీఆర్(KTR) నామినేషన్ కేంద్రానికి వెళ్లారు.
Alert gunman stops @KTRBRS fall from campaign vehicle in #Armoor #Telangana when railing atop vehicle collapsed with brake/overcrowding; #ArmoorCandidate Jeevan Reddy & #SureshReddy, flanking #KTR, fell off vehicle, given first-aid; #KTR left 4 KodangalCampaign @ndtv @ndtvindia pic.twitter.com/7HcQmLWNcU
— Uma Sudhir (@umasudhir) November 9, 2023