Hyderabad Metro | తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ తెలిపింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి నుంచే హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. దీంతో రోడ్లపైకి వరదనీరు చేరి వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది.
సోమవారం రాత్రి హైటెక్ సిటీలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యపై ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్(KTR)ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీనికి సమాధానం చెబుతూ హైదరాబాద్ ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. ఈ సదర్భంగా మెట్రో(Hyderabad Metro) పొడగింపుపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న మెట్రో మార్గాలను మరికొంత పొడగించాలని నెటిజన్ కోరగా.. వచ్చే కేబినెట్‌లో ఇదే ప్రధాన అంశంగా తీసుకుంటున్నామని తెలిపారు. మెట్రో పొడగింపుపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన శాఖను ప్రతిపాదనలు అడిగినట్టు కేటీఆర్ తెలిపారు.