Minister KTR | మాది బీటీమ్ కాదు ఢీ టీమ్.. రాహుల్ గాంధీకి కేటీఆర్ కౌంటర్

-

Minister KTR gives strong counter to Rahul Gandhi  | ఆదివారం ఖమ్మం లో జరిగిన జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ లపై విమర్శల వర్షం కురిపించారు. తొమ్మిదేళ్ల బీఆరెస్ పాలనలో తెలంగాణ ప్రజల కళలు కల్లలుగా మారాయి. కేసీఆర్(KCR) తనకు తాను ఒక రాజుగా.. తెలంగాణను తన జాగీరుగా భావిస్తున్నారన్నారు. ఇందిరమ్మ పేదలకు ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కున్నారని ఆరోపించారు. ఈ విషయం జోడో యాత్రలో ప్రజలు నా దృష్టికి తెచ్చారంటూ రాహుల్ గాంధీ తెలిపారు.

- Advertisement -

కాంగ్రెస్ ఇచ్చిన భూములు కేసీఆర్ సొత్తు కాదు.. ఆ భూములు పేదల హక్కు. ధరణితో వేల ఎకరాల భూములు దోచుకున్నారు. రైతులు, ఆదివాసీలు, యువకులు, దళితులు.. ఇలా అన్ని వర్గాలను కేసీఆర్ దోచుకున్నారంటూ రాహుల్ మండిపడ్డారు.

పార్లమెంట్ లో కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే… బీఆరెస్ బీజేపీ కి బీ టీమ్ గా పనిచేసింది. కేసీఆర్ రిమోట్ నరేంద్ర మోదీ చేతుల్లో ఉందంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. విపక్షాల సమావేశానికి బీఆరెస్ ను పిలవమని కొందరు చెప్పారు. కానీ బీఆరెస్ ను పిలిస్తే కాంగ్రెస్ సమావేశానికి రాదు అని మేం స్పష్టం చేసాం. బీజేపీకి బీ టీమ్ బీఆరెస్ తో కాంగ్రెస్ ఎప్పుడూ కలవదు అంటూ రాహుల్ స్పష్టం చేశారు. బీఆరెస్ బీజేపీ రిష్టాచార్ సమితి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ బీ టీమ్ కు బుద్ది చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలి అంటూ పిలుపునిచ్చారు.

రాహుల్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్:

జనగర్జన సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మినిస్టర్ కేటీఆర్(Minister KTR) స్పందించారు. బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఆయన ఏమని ట్వీట్ చేశారంటే…

“మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు..మీదే భారత రాబందుల పార్టీ

ఏఐసీసీ అంటేనే… అఖిల భారత కరప్షన్ కమిటీ All India Corruption Committee

దేశంలో… అవినీతికి, అసమర్థతకు.. ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్

స్కాములే తాచుపాములై.. మీ యూపీఏను.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను దిగమింగిన చరిత్రను ప్రజలు మరిచిపోలేదు.

మా పార్టీ బీజేపీకి.. బీ టీమ్ కాదు.. కాంగ్రెస్ పార్టీకి.. సీ టీమ్ అంతకన్నా కాదు. బీజేపీ-కాంగ్రెస్ రెండింటీనీ… ఒంటిచేత్తో ఢీకొట్టే.. ఢీ టీమ్.. బీఆర్ఎస్

బీఆర్ఎస్ ను నేరుగా ఢీకొనే దమ్ములేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే కుట్ర చేస్తారా ? ఈ మిస్ ఫైరింగ్ లో ముమ్మాటికీ కుప్పకూలేది.. కాంగ్రెస్సే

లక్ష కోట్లు వ్యయం కాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతా ? అర్థంలేని ఆరోపణలు చేసి.. ప్రజాక్షేత్రంలో ఎన్నిసార్లు నవ్వులపాలవుతారు

తెలంగాణ ప్రజలు కోరుతోంది.. నిర్మాణాత్మక ప్రతిపక్షం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా తెలియని ప్రతిపక్షం కాదు.

భూములు, భూరికార్డుల చుట్టూ అల్లుకున్న సవాలక్ష చిక్కుముళ్లను విప్పిన ధరణిని ఎత్తివేసి.. మళ్లీ దళారుల రాజ్యం తెస్తామన్న రాహుల్ గాంధీని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు

కర్ణాటకలో “అన్నభాగ్య” హామీని గంగలో కలిపి.. ఇక్కడ 4 వేల పెన్షన్ అంటే నమ్మేదెవరు ?

ఎన్నికల్లో హామీఇచ్చిన రేషన్ ఇవ్వలేనోళ్లు ఇక్కడికొచ్చి డిక్లరేషన్ అంటే విశ్వసించేదెవరు ?

కర్ణాటకలో బీజేపీని ఓడించింది అక్కడి ప్రజలు తప్ప ముమ్మాటికీ కాంగ్రెస్ కానే కాదు.. మరో ప్రత్యామ్నాయం లేకే ఆ ఫలితం తప్ప అది మీ ఘనత కాదు – సమర్థత అంతకన్నా కాదు

సమ్మక్క జాతరను తలపించేలా పండుగలా సాగుతున్న పోడుభూముల పంపిణీ రాహుల్ గాంధీకి కనబడటం లేదా..?? కంటివెలుగు కింద పరీక్షలు చేయించుకోండి..

4.6 లక్షల ఎకరాలు పంచి అడవిబిడ్డల జీవితాల్లో ఆనందాన్ని నింపిన మనసున్న ముఖ్యమంత్రి కేసిఆర్ గారు

నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు జల్ జంగల్ జమీన్ అనే మన్యంవీరుడు కుమ్రంభీం కలలను కూడా సంపూర్ణంగా సాకారం చేసిన దార్శనిక ముఖ్యమంత్రి కేసిఆర్ గారు..

మీ పాలనలో మంచం పట్టిన మన్యం వార్తలు మా పాలనలో మన్యానికి మంచిరోజులు

తెలంగాణలో… నిరంతరం పేదల పక్షాన నిలిచిన పార్టీ మాది…

బ్రోకర్లు, కబ్జాకోరుల పక్షాన.. ఎప్పుడూ నిలబడే పార్టీ… మీది.

కారు స్టీరింగ్ కేసిఆర్ గారి చేతిలో పదిలం కానీ కాంగ్రెస్ పైనే రాహుల్ కు కంట్రోల్ తప్పింది

బంగాళాఖాతంలో ఆల్రెడీ నిండా మునిగిన పార్టీ కాంగ్రెస్.. ప్రజల గుండెల నిండా అభిమానం పొందిన పార్టీ బీఆర్ఎస్.

మా తొమ్మిదేళ్ల పాలన.. వెలుగుల ప్రస్థానం గత కాంగ్రెస్ పదేళ్ల పాలన.. చీకటి అధ్యాయం కుమ్ములాటల కాంగ్రెస్ ను నమ్మితే మళ్లీ కల్లోలం..

ఇది.. చైతన్యానికి ప్రతీకైన.. తెలంగాణ సమాజానికి తెలిసిన నిలువెత్తు నిజం..

బీఆర్ఎస్ విస్తరిస్తే అంత వణుకెందుకు ? జాతీయ రాజకీయాలు.. మీ జాగీరా.. ??

వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ దేశానికి దొరికిన వజ్రాయుధం.. బీఆర్ఎస్

జై తెలంగాణ జై భారత్” అంటూ కేటీఆర్(Minister KTR) ట్వీట్ చేశారు.

 

Read Also:
1. కేసీఆర్ తెలంగాణకు రాజులా ఫీలవుతున్నాడు: రాహుల్ గాంధీ
2. మీరు 10 ఇస్తే మేము 80 ఇస్తాం: రేవంత్ రెడ్డి

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

RGV | పరారీలో రాంగోపాల్ వర్మ..!

వివాదాల దర్శకుడు రాం గోపాల్ వర్మ(RGV) ప్రస్తుతం పరారీలో ఉన్నారంటూ వార్తలు...

Rashmika | పెళ్ళిపై స్పందించిన రష్మిక..!

‘పుష్ఫ-2’ మూవీ ఈవెంట్‌ను చెన్నై వేదికగా ‘వైల్డ్ ఫైర్’ నిర్వహించారు మేకర్స్....