KTR: ఫామ్‌హౌస్ డీల్‌పై కేసీఆర్ అన్ని వివరాలు వెల్లడిస్తారు

-

Minister KTR: మునుగోడు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ నాయకులు ధనబలంతో కొనాలనుకుంటున్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలోఆయన మాట్లాడారు. బీజేపీ పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ ఛార్జ్‌షీట్‌లో ఆధారాలతో కూడిన ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. దానిపై ఇప్పుడు మాట్లాడితే విచారణను ప్రభావితం చేస్తున్నారని అంటారు. ఈ కేసుకు సంబంధించి సందర్భాన్ని బట్టి సీఎం కేసీఆర్‌ వివరిస్తారు. ఈ విషయంలో తొందరపడొద్దని మా పార్టీ శ్రేణులకు ఇప్పటికే సూచించాను. సమయం వచ్చినప్పుడు సీఎం అన్ని వివరాలు వెల్లడిస్తారు. ప్రమాణాలతో సమస్యలు పరిష్కారం అయితే పోలీసులు, కోర్టులు ఎందుకు? అని బండి సంజయ్‌‌ని కేటీఆర్ (Minister KTR ) ప్రశ్నించారు.

- Advertisement -

Read also: బిందెలో బుసలు కొట్టిన నాగుపాము

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...