Minister KTR in Davos World Economic Forum: మేము చేసే అప్పులకు లాజిక్ ఉందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. నేటి (సోమవారం) నుంచి ఈ నెల 20 వరకు దావోస్ లో జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ లో పాల్గొనేందుకు కేటీఆర్ స్విట్జర్లాండ్ వెళ్ళారు. అక్కడ నిర్వహించిన ఎన్నారై ల మీట్ లో పాల్గొన్న మంత్రి రాష్ట్ర అప్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అప్పులపై బిజెపి చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టారు.
Minister KTR in Davos: రాష్ట్రం కోసం అప్పు చేసిన ప్రతి పైసా పెట్టుబడి లాభాలతో తిరిగొస్తుందన్నారు. లాజిక్స్ అర్థం చేసుకోలేని వాళ్లకు ఏం చెప్పగలమన్నారు. అప్పులు చేసి లాభాలొచ్చే రీతిలో పెట్టుబడి పెడితే తప్పా అన్ని ప్రశ్నించారు. తెలంగాణ అప్పులపై బీజేపీ నానా యాగీ చేస్తోందని మండి పడ్డారు. 14 మంది ప్రధానులు చేసిన అప్పులు రూ.56లక్షల కోట్లయితే ప్రధానిగా మోడీ ఒక్కరే చేసిన అప్పులు వంద లక్షల కోట్లు అన్నారు. మరి ఆ వంద లక్షల కోట్ల అప్పు ఏ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. తెలంగాణ చేసే ప్రతీ పైసా అప్పుకు ప్రతిఫలం ఉందన్నారు. కేంద్రం అప్పులతో చేసిన ఒక్క మంచి పని ఏంటన్నారు. తెలంగాణ అప్పులను ప్రశ్నించే అర్హత బీజేపీకి లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.