కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్(KTR) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ ప్రస్తుత తరుణంలో సాధ్యం కాదంటూ కేంద్రం చేతులెత్తేయడంపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్ సింగ్‌పూరీకి లేఖ రాశారు. అత్యంత రద్దీ కలిగిన హైదరాబాద్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టు(Metro Rail Project) రెండో దశ సాధ్యం కాదని చెబుతున్న కేంద్రం తమకు అనుకూలమైన నగరాలకు మాత్రం పక్షపాత ధోరణితో మెట్రోరైల్ ప్రాజెక్టులు ఇస్తున్న విషయాన్ని లేఖలో కేటీఆర్ ఎత్తిచూపారు. గాంధీనగర్, కొచ్చి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతోపాటు చాలా తకువ జనాభా కలిగిన లక్నో, వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్రాజ్, మీరట్ ఉత్తరప్రదేశ్‌లోని చిన్న పట్టణాలకు మెట్రో ప్రాజెక్టులను కేంద్రం కేటాయించిన విషయాన్ని కేటీఆర్(KTR) ప్రస్తావించారు. జనాభా రద్దీ తకువగా ఉన్న ఇలాంటి నగరాలకు మెట్రో రైల్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని పేరొన్న కేంద్రం, హైదరాబాద్ నగరానికి మాత్రం మెట్రో రైల్ విస్తరణ అర్హత లేదని చెప్పడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.
Read Also: మరో ఎగ్జామ్‌ను వాయిదా వేసిన టీఎస్ పీఎస్సీ
Follow us on: Google News, Koo, Twitter