పంజాగుట్టలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్(Minister KTR) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. అంబేద్కర్ లేకపోతే తెలంగాణ లేదన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మున్న నేత. కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు.. సాహసోపేతమైన పథకం అని పేర్కొన్నారు. సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టడం కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. కొత్త పార్లమెంట్‌కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. పంజాగుట్ట కూడలికి అంబేద్కర్ పేరు పెడుతామని కేటీఆర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహముద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
Read Also: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడే సీఎం: కోమటిరెడ్డి
Follow us on: Google News, Koo, Twitter