హైదరాబాద్ ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు చౌరస్తాలోని ఫ్లైఓవర్ ర్యాంప్ కూలిన ఘటనలో గాయపడిన బాధితులను మంత్రులు కేటీఆర్(Minister KTR), తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రి(KIMS Hospital)లో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించి చికిత్స అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పూర్తి చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని కేటీఆర్(Minister KTR) భరోసా ఇచ్చారు. ప్రమాద ఘటనపై దర్యాఫ్తునకు జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఇవాళ తెల్లవారుజామున ఫ్లైఓవర్(Flyover) నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్ ఏర్పాటు చేస్తున్న సమయంలో అది కూలిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది కార్మికులు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.గాయపడిన కార్మికులు యూపీ, బీహార్ వాసులుగా తెలుస్తోంది.
Read Also:
1. తెలంగాణకు విముక్తి కోసం ఏకమవుతున్నాం: రేంవత్, పొంగులేటి
2. భాగ్యనగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat