ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme) లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి(Minister Ponguleti) కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెత్తిన గూడు లేదని ఏ పేదవాడు బాధపడకూదన్నదే ఈ పథకాన్ని స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. ఇందిరమ్మ వేసిన బాటలోనే తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, పేదలను సంక్షేమాన్ని అందిస్తుందని చెప్పుకొచ్చారు.
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మిగులు బడ్జెట్‌తో వచ్చిన తెలంగాణను బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని, దాని వల్లే నిధులు కేటాయించే విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సి వస్తోందని వివరించారు.
‘‘ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలో వెళ్ళిన సందర్భంలో గ్రామ గ్రామాన వెళ్ళిన సందర్భంలో ఇందిరమ్మ ఇళ్లు చూపించి సంతోష పడ్డారు. మళ్ళీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని భావించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న 10 ఏళ్లలో పేదలను విస్మరించారు. మిగితా ఇళ్లను పునరుద్ధరించి 30,000 ఇళ్లను కేటాయిస్తున్నాము. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు కట్టి పేదవాడికి ఇవ్వడం జరుగుతుంది.
వారిలో దివ్యాంగులు, వితంతువులు, రైతుకూలీలు ప్రాధాన్యత ఇస్తాం. ప్రతి పేద వాడికి ఇల్లు ఇస్తాము. ఏ పార్టీ అని కానీ, మళ్ళీ మాకు ఓటు వేస్తావా అని కానీ అడగం. ప్రతి పేద వాడికి ఇల్లు కేటాయిస్తాము. 4 దశల్లో 5లక్షల రూపాయలు కేటాయింపు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు కేటాయింపు చేస్తాము. వరి వేస్తే ఉరి అన్న గత ప్రభుత్వం ఆలోచనలకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది’’ అని పొంగులేటి(Minister Ponguleti) వివరించారు.