వేములవాడ స్వామి వారి సమక్షంలో ఇచ్చిన హామీని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) నెరేవర్చారు. ఆగస్టు నెలలో వేములవాడ ఆలయాన్ని సందర్శించిన ఆయన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా మరిన్న సదుపాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం తాజాగా ఆలయంలోని అన్నదాన సత్రానికి రూ.35.25 కోట్ల నిధులు మంజూరు చేశారు. వేములవాడ రాజ రాజేశ్వరి ఆలయ సదుపాయాల విషయంలో మంత్రి పొన్నం చూపిన చొరవపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే విధంగా ఆలయ అభివృద్ధి పనులను కూడా వేగంవంతం చేయాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే ఈరోజు వేములవాడ(Vemulawada)లో పర్యటించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెళ్లారు. వేములవాడ చేరుకున్న సీఎంకు మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), దుద్దిల్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే లు మేడిపల్లి సత్యం , కవంపల్లి సత్యనారాయణ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకుర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్,డిజిపి జితేందర్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ పుష్ప గుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు.