Minister Sabitha Indra Reddy’s office besieged by Protesters: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలంటూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నిరస చేపట్టారు. హైదారాబాద్‌లోని బహీర్‌బాగ్‌లో ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ముట్టడించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఖాళీగా ఉన్న 24 వేల పోస్టులను భర్తీ చేయాలని వారు నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ వాసులకే అన్న టీఆర్‌ఎస్ నేతలు.. ఇప్పుడు ఆ హామీలను మరిచిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే, ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని ఆందోళనకారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేత, వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు


