దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లతో తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) సమావేశమయ్యారు. వారికి తమ సానుభూతిని ప్రకటించారు. తమ సంఘీభావం తెలిపిన భారత రాష్ట్ర సమితి (BRS) నాయకులు.. నిరసనకారులకు తమ మద్దతును ప్రకటించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సహా అధికారులపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు న్యాయం చేయాలని కోరుతున్న రెజ్లర్లకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. దీనికి సంబంధించి మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) ట్వీట్ ద్వారా రెజ్లర్ల నిరసనకు మద్దతుగా “ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు సంఘీభావం తెలుపుతున్నాము. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఛాంపియన్లకు త్వరలోనే తగిన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా” అని ట్వీట్ చేశారు.
Read Also: ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ
Follow us on: Google News, Koo, Twitter