తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) తన ప్రధాన అనుచరుడి పాడె మోశారు. తుమ్మల ప్రధాన అనుచరుడు గాదె సత్యం అనారోగ్యంతో మృతి చెందారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అతడి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని పాడె మోశారు. వైకుంఠధామం వరకు మంత్రితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు వెళ్లారు. మృతుడి కుటుంబానికి మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.