Mla Balka Suman: వైఎస్ఆర్ కుటుంబం తెలంగాణకు వ్యతిరేకం: బాల్క సుమన్

Mla Balka Suman

Mla Balka Suman reacts on Ys sharmila comments: వైఎస్ఆర్ కుటుంబం తెలంగాణకు వ్యతిరేకమని, షర్మిల కూడా చాలాసార్లు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో షర్మిల హైదరాబాద్‌ను పాకిస్థాన్‌తో పోల్చారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఆమె విషం కక్కుతోందని.. తెలంగాణ వ్యతిరేకి తెలంగాణలో తిరుగుతుందని అన్నారు.

తెలంగాణ పోరాటం గురించి షర్మిలకు ఏం తెలుసో చెప్పాలన్నారు. షర్మిల వెనుక ఉన్న వారెవరో తెలంగాణ ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. సంస్కారహీనంగా షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నా ఏం మాట్లాడొద్దా అని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నల్లి లాగా నలిపెస్తామని..టీఆర్ఎస్ అనుకుంటే షర్మిల ఒక్క అడుగు కూడా బయట పెట్టలేదన్నారు. సర్పంచ్‌‌గా కూడా గెలవని షర్మిల బతుకెంతా? అంటూ నిలదీశారు. గతంలో ఏపీ సీఎం జగన్, వైఎస్ఆర్ టీపీ షర్మిల తెలంగాణను వ్యతిరేకించారని బాల్క సుమన్ (Mla Balka Suman) ఆగ్రహంవ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here