తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. అంటూ మల్లారెడ్డి పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అదే విధంగా కొన్నిసార్లు రాజకీయ నాయకుల ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతూ హైలైట్ అయ్యారు. తాజాగా మల్కాజిగిరి ఎంపీగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధిస్తారని సంచలన ప్రకటన చేశారు.
హైదరాబాద్ కొంపెల్లిలోని కేఎస్ఆర్ కన్వెన్షన్ హాలులో జరిగిన ఓ వేడుకకు ఈటల, మల్లారెడ్డి హాజరయ్యారు. దీంతో ఇద్దరూ అప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భగా ఈటలతో మల్లన్న ఫోటో దిగారు. అనంతరం ఎన్నికల గురించి ప్రస్తావన రాగా ‘‘మల్కాజిగిరిలో ఇంకెవరు గెలుస్తారు. నువ్వే గెలుస్తున్నవ్’’ అంటూ ఈటల రాజేందర్‌ను గట్టిగా హత్తుకున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఓవైపు పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు కోసం బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే మల్లారెడ్డి(Malla Reddy) మాత్రం బీజేపీ అభ్యర్థి గెలుస్తారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దీంతో బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనంటూ తాము చెబుతుంది ఇప్పుడు నిజమైందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మొత్తానికి మల్లారెడ్డి తన వ్యాఖ్యలతో మరోసారి తెలంగాణ రాజకీయాల్లో కాక రేపారు.
BRS Mla Malla Reddy Says with BJP MP Candidate "Brother You will win"
అన్నా నువ్వే గెలుస్తున్నావ్!
ఈటలతో మాజీ మంత్రి మల్లారెడ్డిబీజేపీ + బీఆర్ఎస్ | BJP + BRS pic.twitter.com/RI7fYm24Nk
— Congress for Telangana (@Congress4TS) April 26, 2024