Mla Raja Singh anger on State Intelligent over Bulletproof vehicle: ఎమ్మెల్యే రాజాసింగ్ భద్రతరీత్యా ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మరోసారి మెురాయించింది. అఫ్జల్గంజ్ వద్ద వాహనం ఆగిపోయిందని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందనీ.. ఉగ్రవాదుల నుంచి హాని ఉందని తెలిసి కూడా తరచూ ఆగిపోతున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చారంటూ రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు తనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారనీ.. కానీ అది 4 నెలల క్రితం రోడ్డు మధ్యలోనే ఆగిపోయిందని గుర్తు చేశారు.
ఈ వాహనాన్ని మార్చాలని ఆ వాహనాన్ని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి తిరిగి పంపించినా..మరమ్మతులు చేసి.. మళ్లీ అదే వాహనాన్ని ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం నాంపల్లి కోర్టుకు వెళ్తున్నప్పుడు ఆగిపోయిందనీ.. ఇప్పుడు తాజాగా అఫ్జల్ గంజ్లో మరొకసారి ఆగిపోయిందన్నారు. మరొక దారిలేక తన సొంత వాహనాన్ని రప్పించుకొని వెళ్లాల్సి వచ్చిందని ఎమ్మెల్యే వాపోయారు. కండీషన్లో లేని వాహనంతో తనకు ఎటువంటి భద్రత ఉటుందని రాజాసింగ్ (Mla Raja Singh) ఆవేదన వ్యక్తం చేశారు.