Raja Singh | సొంతవారే తనపై కుట్ర చేస్తున్నారు.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఎమోషనల్

-

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చు అన్నారు. అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాల్లో మాట్లాడిన రాజాసింగ్.. ఇంటా బయటా తనను అసెంబ్లీకి రావొద్దనే కోరుకుంటున్నారని తెలిపారు. వచ్చేసారి అసెంబ్లీకి రాకపోవచ్చని.. రానున్న ఎన్నికల్లో గోషామహల్‌లో ఎవరు గెలుస్తారో తెలియదన్నారు. తాను మాత్రం తిరిగి అసెంబ్లీకి రాననే అనిపిస్తుందన్నారు. తాను అసెంబ్లీకి రాకుండా ఉండటానికి చాలా రాజకీయాలు చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి వచ్చినా, రాకపోయినా.. గోషామహల్ నియోజకవర్గ ప్రజల కోసం ఎప్పుడు తానుంటా అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలిచినా, ఓడినా.. ముఖ్యమంత్రి మాత్రం గోషామహల్ నియోజకవర్గంపై దయ చూపాలని వేడుకుంటున్నా అంటూ భావోద్వేగమయ్యారు.

- Advertisement -

గతంలో మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌(Raja Singh)పై బీజేపీ సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిదే. రెండేళ్లు కావొస్తున్నా సస్పెన్షన్ ఇప్పటికీ ఎత్తివేయలేదు. ఎప్పటికైనా సస్పెన్షన్ ఎత్తివేస్తారని భావిస్తుండగా.. పార్టీ జాతీయ నాయకత్వం మాత్రం ఏమాత్రం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో టీడీపీలోకి వెళ్తారంటూ ప్రచారం కూడా జరగగా.. ఆ ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది టీడీపీ ద్వారానే అయినప్పటికీ.. ఆ పార్టీలో చేరబోనని స్పష్టంచేశారు. ఉంటే బీజేపీలో ఉంటా.. లేదంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానంటూ క్లారిటీ ఇచ్చారు.

ఈ మధ్య బీఆర్ఎస్ కీలక నేత, మంత్రి హరీష్ రావుతోనూ భేటీ అవ్వడం కొత్త ఊహాగానాలకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ సైతం మీరు బీజేపీలో లేరు. మిమ్మల్ని పార్టీ సస్పెండ్ చేసింది కదా? ఆ విషయం మరిచారా? అంటూ రాజాసింగ్‌పై సెటైర్లు వేశారు.

Read Also: బిగ్ బ్రేకింగ్: తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూత
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...