MLA Ticket Aspirants | MLC కవిత ఇంటికి బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టారు. ఫస్ట్ లిస్ట్‌లో టికెట్ కోల్పోయామని విషయం గ్రహించిన సిట్టింగ్ ఎమ్మె్ల్యేలు, ఆమె అనుచరులు ఒక్కక్కరుగా కవిత ఇంటికొచ్చి చివరి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటివరకు జనగామా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌లు కవిత ఇంటికొచ్చి వేడుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కవిత యాక్టివ్ అయ్యారు. ఇన్నాళ్లు కేవలం నిజామాబాద్‌కే పరిమితం అయిన ఆమె ఈసారి రాష్ట్రం మొత్తంపై దృష్టి సారించారు.
MLA Ticket Aspirants | పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ వారినీ యాక్టివ్ చేస్తున్నారు. పలు జిల్లాల్లోని అన అనుచరులకు టికెట్లు ఇప్పించేందుకు తండ్రి కేసీఆర్ వద్ద మొరపెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, నిజామాబాద్ ఎంపీ స్థానంలో గత ఎన్నికల్లో కవిత ఓడిపోయిన కవిత.. ఈసారి కేవలం అక్కడికే పరిమితం కాకుండా స్టేట్‌లో తన సత్తా ఏంటో చూపించాలని ఫిక్స్ అయినట్లు తెలస్తోంది. మరి కవిత వద్ద మొరపెట్టుకుంటున్న ఎమ్మెల్యేలపై కవిత ఏ నిర్ణయం తీసుకుంటుందో.. ఏమని సర్దిచెబుతుందో చూడాలి. కాసేపట్లో 105 మందితో కూడిన ఫస్ట్ లిస్ట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేయనున్నారు.