MLAs Purchase case : తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామ.. సిట్ మెయిల్

-

MLAs Purchase case SIT emails to MP Raghu Rama Krishnam raju: తెలంగాణలో సంచలనం సృష్టించి, తీవ్ర రాజకీయ దుమారానికి తెరలేపిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే సిట్‌ పలువురికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులు అందుకున్నవారిలో ఆంధ్రప్రదేశ్‌ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ఒక్కరు. నేడు 10:30 కి రఘురామ హాజరుకానున్న నేపథ్యంలో, హాజరు కానవసరం లేదంటూ సిట్‌ ఈమెయిల్‌ అందించింది. మళ్లీ అవసరమైతే పిలుస్తామని ఈమెయిల్‌లో సిట్‌ పేర్కొంది. అయితే ఈ కేసులో నిందితులతో రఘురామ ఉన్న ఫోటోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఏ1, ఏ2లతో దగ్గరి సంబంధాలు ఉన్నట్లు సిట్‌ గుర్తించింది. ఈ క్రమంలో రఘురామను (MLAs Purchase case) విచారణకు వద్దని సిట్‌ ఈమెయిల్‌ పంపటంపై సర్వత్రా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో 41A నోటీసులను నలుగురికి జారీ చేయగా, అందులో ఇప్పటికీ హాజరుకాని ఇద్దరికి లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది సిట్‌.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...