Mlc Kavitha: అరవింద్ ఎక్కడ నిలబడ్డా ఓడిస్తా..కవిత సంచలన వ్యాఖ్యలు

0
Mlc kavitha

Mlc Kavitha criticized nizamabad mp dharmapuri aravind: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీజేపీ ఎంపీ అరవింద్ పై మండిపడ్డారు. నిజామాబాద్ పేరును అరవింద్ పాడుచేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటులో అరవింద్ ఫర్మామెన్స్ సున్నా అని అన్నారు. రాజస్థాన్ యూనివర్శిటీలో చదువుకున్నట్లు అరవింద్ ఫేక్ సర్టిఫికేట్లు పెట్టారన్నారు. బురద మీద రాళ్లు వేయకూడదనే తను అరవింద్ మాటలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. తను కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఖర్గేతో మాట్లాడినట్లు అరవింద్ చెబుతున్నారని.. కాంగ్రెస్‌తో కలిసి గెలిచింది అరవిందే అని ధ్వజమెత్తారు. రాజకీయాలు చెయ్..కానీ పిచ్చి వేషాలు వేయకు.. అని ఆగ్రహంవ్యక్తం చేశారు. ‘‘ఈ రోజు నేను బాధతో మాట్లాడుతున్నా… అరవింద్ ఎక్కడ నిలబడ్డా ఓడిస్తా’’ అని కవిత సవాల్ చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here