MLC Kavitha fires on BJP: బీజేపీ వాళ్లు చేస్తున్న పని రామ్ రామ్ జప్నా.. పరాయి లీడర్ అప్నా అనటమే అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట టీఆర్ ఎస్ కార్యకర్తల అత్మీయ సమ్మేళనానికి హాజరైన కవిత,బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బయట లీడర్లను తీసుకువచ్చి రాజకీయం చేస్తున్నారని బీజేపీపై ఫైర్ అయ్యారు. బీజేపీలో చేరకపోతే, ఐటీ, ఈడీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. బెదిరించట కోసమే గత నెల రోజుల నుంచి టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై రైడ్ చేస్తున్నారని ఆరోపించారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి.. తెలంగాణ వాళ్లు భయపడే వాళ్లు కాదని బీజేపీకు ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీఎల్ సంతోష్ పేరు వచ్చింది కాబట్టే, విచారణకు పిలిచారని అన్నారు. పిలిస్తేనే బీజేపీ వాళ్లు భయపడి పది కేసులు వేశారనీ, విచారణ చేయవద్దంటూ కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారన్నారు. అయినప్పటికీ మనం సుప్రీం కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. టీఆర్‌ఎస్ మంత్రులు ఏ ఏజెన్సీకైనా సహకరిస్తున్నారని అన్నారు. బండి సంజయ్ యాదగిరి గుట్టకు వెళ్లి దొంగ ప్రమాణాలు చేశారంటూ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.