MLC Kavitha Fires on BJP MP Arvind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తనపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. మరోసారి తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చెప్పుతో కొడతానంటూ ఘాటుగా స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె ధర్మపురి అర్వింద్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె ఏం మాట్లాడారో ఆమె మాటల్లోనే కింద ఉంది చూడండి.
కవిత వ్యాఖ్యలు:
ఎంపీ అరవింద్(MP Arvind) చిన్న మనస్సుతో,, అత్యంత హేయమైన భాషతో వ్యాఖ్యలు చేస్తున్నారు.
చిల్లర మాటలతో నిజామాబాద్ పేరు చెడకొడుతున్న వ్యక్తి ఎంపీ అరవింద్.
ఎంపీగా ఉండి 4 ఏళ్లలో 5 డెబిట్స్ పాల్గొనే…56 ప్రశ్నలకు మాత్రమే పరిమితం అయ్యారు.
పార్లమెంట్ లో టీఆరెస్ ఎంపీలతో పోల్చితే కనీసం సగం పర్ఫామెన్స్ కూడా లేదు.
బాండ్ పేపర్ రాసి హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు.
ఫేక్ సర్టిఫికెట్స్ తో ఎన్నికల్లో పోటీ చేశారు..ఆయనపై కేసులు పెడతాం.
ఎంపీ అరవింద్ ఒక బురద లాంటి వ్యక్తి.
నేను కాంగ్రెస్ పార్టీ ఖర్గే తో మాట్లాడిన అన్నట్లు ఆరోపణలు చేస్తున్నారు.
నా బతుకు, పుట్టుక తెలంగాణ.. తెలంగాణ వాసన లేని పార్టీలతో నాకేం సంబంధం లేదు.
నేను రాజకీయాలలో వచ్చిన్నప్పటి నుంచి వ్యక్తిగతంగా ఎప్పుడూ మాట్లాడలేదు.
భాషను మార్చుకోకపోతే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడుతా
ఎక్కడికి వెళ్లినా వెంటపడి ఓడిస్తా
ఈ వ్యక్తి మీద నేను భవిష్యత్ లో మాట్లాడను.
ఈ వ్యక్తి ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోటీ చేసి ఓడిస్తా
ఇలా మాట్లాడినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తున్నా
అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే కొట్టి కొట్టి సంపుతాం
నేను బాధతో మాట్లాడుతున్న
నాకు అధికారికంగా ఎలాంటి నోటీసులు రాలేదు
లిక్కర్ స్కాం పై కోర్టు ఆదేశాలు ఉన్నా బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు
ఎలాంటి కేసులులైనా ఎదురుకుంటాం
25వేల కేసులు ప్రతిపక్ష నేతలపై బీజేపీ పెట్టింది.. ఒక్క కేసు నిరూపించలేదు