MLC Kavitha: లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు 

-

లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 23 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. నేటితో సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు కవితను కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా.. 9 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. దీంతో ఆమెను తిహార్ జైలుకు తరలించారు. అంతకుముందు కోర్టుకు హాజరయ్యే క్రమంలో కవిత మీడియాతో మాట్లాడుతూ ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ అని ఆరోపించారు. బయట బీజేపీ వాళ్లు మాట్లాడిందే లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారని చెప్పారు. రెండేళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని కొత్తగా అడిగేందుకు ఏం లేదన్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటే సీబీఐ కస్టడీలో ఉన్న కవితను ఆదివారం సాయంత్రం ఆమె సోదరుడు కేటీఆర్, భర్త అనిల్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కలిసి ధైర్యం చెప్పారు. మరోవైపు మనీల్యాండరింగ్ కేసులో కవితకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ పిటీషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది. కాగా లిక్కర్ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నేటితో ఆమె అరెస్టై సరిగ్గా నెల రోజులు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...