జైలు నుంచి విడుదలైన కవిత… సంచలన కామెంట్స్

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఎట్టకేలకు తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో మంగళవారం సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చింది. దీంతో లిక్కర్ పాలసీ కేసులో కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రిలీజ్ ఆర్డర్ అందజేసింది. ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇచ్చిన షూరిటీ బాండ్లను ట్రయల్ కోర్టు స్వీకరించింది. దాదాపు మూడు గంటల విడుదల ప్రాసెస్ అనంతరం అధికారులు ఆమెని రిలీజ్ చేశారు.

- Advertisement -

కంటతడి పెట్టుకున్న MLC Kavitha…

లిక్కర్ స్కాం కేసులో ఈ ఏడాది మార్చ్ 15 న అరెస్టైన కవిత… 165 రోజుల తర్వాత బెయిల్ పై బయటకి వచ్చారు. అప్పటికే తీహార్ జైలు వద్దకు చేరుకున్న ఆమె కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఆమెకి ఘనంగా స్వాగతం పలికారు. జైలు బయట కుటుంబ సభ్యుల్ని చూసి కవిత భావోద్వేగానికి లోనయ్యారు. భర్తని, కొడుకుని ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. కేటీఆర్ చేతికి ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని ఎమోషనల్ అయ్యారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడిన కవిత సంచలన కామెంట్స్ చేశారు.

జగమొండిని చేశారు… కవిత

“నేను కేసీఆర్ బిడ్డను. నేను మొండి దాన్ని. అనవసరంగా నన్ను జైలుకు పంపారు. ఐదు నెలలు కుటుంబానికి దూరంగా జైల్లో ఉన్నాను. 18 ఏళ్లు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. మొత్తం దేశానికి తెలుసు రాజకీయ కక్షలో భాగంగానే నా మీద కేసు పెట్టి నన్ను జైలు పంపించారు. ఇంకా గట్టిగా పోరాడుతాను గట్టిగా పని చేస్తాను వెనక్కి పోయే ప్రసక్తి లేదు. నన్ను అనవసరంగా జైలుకు పంపి జగమొండి దాన్ని చేశారు. నాకు సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాను. చాలా రోజుల తర్వాత మీ అందరినీ కలవడం సంతోషంగా ఉంది. ఈ కష్ట సమయంలో నాకు నా కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అని భావోద్వేగభరితమైన వ్యాఖ్యలు చేశారు కవిత.

Read Also: వేణుస్వామికి బ్రాహ్మణ చైతన్య వేదిక వార్నింగ్..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...