ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు ఈడీ మరోసారి నోటీసులు అందించింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ ఈ నోటీసుల్లో పేర్కొంది. అరుణ్ రామచంద్ర పిల్ల అప్రూవర్ గా మారిన వెంటనే కవితకు ఈడీ నోటీసులు రావడం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పిళ్లై ని కవిత బినామీగా చెబుతోన్న ఈడీ.. కవితని మరోసారి విచారణ చేయనుండడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠకు తెర లేపింది. కాగా ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపటి క్రితం స్పందించారు. అవి ఈడీ నోటీసులు కాదని, మోడీ నోటీసులని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ BRS పార్టీని దెబ్బతీయాలనే దురుద్దేశంతో BJP కుట్రలు చేస్తోందని ఆగ్రహించారు.
రేపు విచారణకు హాజరు కావట్లేదని, నోటీసులని తమ లీగల్ టీం చూసుకుంటుందని కవిత స్పష్టం చేశారు. ఏడాది కాలం నుంచి లిక్కర్ స్కామ్(Liquor Scam) ఎపిసోడ్ డైలీ సీరియల్ లా నడుస్తోందని, ఎంతకాలం సాగదీస్తారో కూడా వాళ్ళే చెప్పాలని అన్నారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో రేపు (శుక్రవారం) విచారణకు హాజరవడం కుదరదని తేల్చి చెప్పారు. రాజకీయ కక్షతో పంపిన నోటీసు కాబట్టి దానికి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు కవిత(MLC Kavitha). లీగల్ టీమ్ చెప్పిన ప్రకారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి లిక్కర్ స్కామ్ లో కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారని, దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవద్దని సూచించారు.