ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు నోటీసులు అందజేశారు. తాజగా.. నోటీసులపై ఆమె స్పందించారు. తనకు ఈడీ నోటీసులు అందాయని కవిత స్పష్టం చేశారు. విచారణకు హాజరు కావాల్సిన అంశంపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. చట్టాన్ని గౌరవించే ఒక పౌరురాలిగా దర్యాప్తునకు పూర్తిస్థాయితో సహకరిస్తానని వెల్లడించారు. మార్చి 9వ తేదీ విచారణకు రావాలని నోటీసుల్లో ఉందని, అయితే ముందస్తు అపాయింట్‌మెంట్స్ ఉన్నందున, రేపటి విచారణకు హాజరుకావాలా? లేక నోటీసులపై లేఖ రాయాలా? అనేది న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
మార్చి 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహిళా బిల్లు కోసం దీక్ష కార్యక్రమం ఉందని, ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఒకరోజు నిరాహార దీక్ష తలపెట్టామని, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్(KCR)ను, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బీజేపీ ఈ విషయం తెలుసుకోవాలని కవిత(MLC Kavitha) స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటామని విమర్శించారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలకు గుర్తుచేస్తున్నా అని కవిత అన్నారు. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాం అని ఈడీ నోటీసులపై కవిత ఘాటుగా స్పందించారు.
Read Also: ఢిల్లీ మద్యం కుంభకోణంలో MLC కవితకు నోటీసులు
Follow us on: Google News