Mlc kavitha: షర్మిలపై ఎమ్మెల్సీ కవిత సెటైరికల్ ట్వీట్?

-

Mlc kavitha satires on sharmila: వైఎస్‌ఆర్‌‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలపై ఎమ్మెల్సీ కవిత సెటైరికల్ ట్వీట్ చేశారు. తాము వదిలిన ”బాణం” తానా అంటే తందానా అంటున్న ”తామరపువ్వులు” అంటూ ట్వీట్ చేశారు. ఒకే ట్వీట్ లో వైఎస్ఆర్‌‌టీపీ, బీజేపీని కలిపి టార్గెట్ చేశారు. కాగా.. షర్మిల పాదయాత్ర చేస్తున్నప్పుడు, ఆమె కాన్వాయ్‌ బస్సుకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మంట పెట్టటంతో, ఈ వివాదం మరింత ముదిరి మంగళవారం టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడిలో ధ్వంసం అయిన కారులోనే, భారీ కాన్వాయ్‌తో ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు షర్మిల ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ఆమెను సోమాజిగూడ వద్ద అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం షర్మిలకు నాంపల్లి కోర్టు వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ క్రమంలో ఈ వివాదాన్ని ప్రస్తావిస్తూ ఎమ్మెల్సీ కవిత (Mlc kavitha) ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీంతో వైఎస్ఆర్‌‌టీపీ శ్రేణులు మండిపడుతున్నారు. తన ఇంటిపై దాడి జరిగితే ఒకలా సాటి మహిళపై దాడి జరిగితే మరోలా స్పందిస్తారా? అని నిలదీస్తున్నారు.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కు హ‌రీశ్‌రావు లేఖ

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) మాజీ...

Supreme Court | ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు నోటీసులు

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.....