MLC Kavitha | మూడు దేశాల్లో బోనాల పండుగ.. పాల్గొననున్న MLC కవిత

-

బోనాల పండుగకు తెలంగాణలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ పండక్కి ప్రాధాన్యత పెరిగింది. ప్రతీ సంవత్సరం ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండగ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు సైతం విడుదల చేస్తుంది. అయితే, కేవలం తెలంగాణలోనే కాకుండా తెలుగువారు స్థిరపడిన అన్ని దేశాల్లో ఈ పండుగను జరుపుకుంటారు. వివిధ దేశాల్లో జరిగే ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పాల్గొని వారిలో జోష్ నింపుతుంటారు. ఈ ఏడాది కూడా ఎమ్మెల్సీ కవిత విదేశాల్లో జరిగే బోనాల ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగానే కవిత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్నారు.

- Advertisement -

ఈనెల 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేన్ నగరంలో భారత జాగృతి ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో బోనాలు సంబరాలు జరగనున్న వేడుకల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు బ్రిస్ బేన్ లోని గాయత్రి మందిరంలో జరగనున్న ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులతోపాటు ఆస్ట్రేలియా మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు. అదే విధంగా ఈ నెల 16న న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరంలో జరగనున్న బోనాలు వేడుకలో ఎమ్మెల్సీ పాల్గొంటారు. న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు వివిధ రాష్ట్రాల ఎన్నారైలు ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయ సమ్మేళనంలో కవిత(MLC Kavitha) పాల్గొంటారు. అనంతరం ఆక్లాండ్‌లోని గణేష్ టెంపుల్ లో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న బోనాల పండుగ లో పాల్గొంటారు.

Read Also: కేటీఆర్‌లా నేను అమెరికాలో బాత్రూంలు కడగలేదు: రేవంత్ రెడ్డి

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...